CPI Narayana: ఎన్నికల కోడ్‌కి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహారం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. విజయవాడలో మోడీ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ప్రధాని మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఉల్లంఘించడంపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశానని.. ఏపీలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని పదే పదే మాట్లాడిన మోడీ ఆధారాలు చూపాలని ప్రశ్నించారు. విధానాల మీద కాకుండా వ్యక్తిగతంగా మోడీ విమర్శలు చేస్తున్నారన్నారు. నిజంగా జగన్ ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చేయకపోతే తెలుగు ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలన్నారు.
Read Also: Smriti Irani: రాహుల్ పై స్మృతి ఇరానీ ఫైర్.. పాక్ నేతలతో సంబంధమేంటి..?
రేపు ఏపీకి చంద్రబాబు, జగన్‌లు సీఎంగా వుండరని.. బీజేపీ అధికారం చేపడుతుందని.. రెండు పార్టీలను చీల్చి ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో హంగ్ ప్రభుత్వం వస్తుందని.. బీజేపీ గెలిస్తే ద్వార పాలకులుగా జగన్, చంద్రబాబు వుంటారని ఎద్దేవా చేశారు. ఒక రోజులో కోటి 30 లక్షలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మంగళ సూత్రం గురించి మాట్లాడే నైతిక హక్కు మోడీకి లేదన్నారు.డబ్బులు ఎగ్గొట్టి దేశం వదిలి పోయిన వారిలో ఒక్కరైనా ముస్లిం, క్రిస్టియన్ లేరని.. ఢిల్లీ పోలీసులను ఉపయోగించి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లపై కేసులు పెడుతున్నారన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయని.. పేదలపై భారాలు, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారని.. బ్లాక్ మెయిల్ రాజకీయాలను ఉపయోగించి బీజేపీ పరిపాలన సాగిస్తోందని ఆరోపించారు.