CPI Narayana: ప్రజా సమస్యలను వదిలేసి.. ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana Slams PM Modi Over Farmers Protest 2024: ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారని, అన్నదాతలపై యుద్ధం సరికాదన్నారు. దేవుళ్లను కలిసే మోడీ.. సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు? అని ప్రశ్నించారు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడో బీజేపీ సమాధానం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడి.. విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… ‘ఎన్డీయే కూటమి బలహీనపడుతుంది. ఇండియా కూటమి బలపడుతుంది. బీహార్‌లో నితీష్ కుమార్ పోయిన కూటమి బలోపేతం అవుతుంది. పొత్తులో భాగంగా వయనాడులో డి రాజా భార్య ఆని రాజా పోటీ చేస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది.కేరళలో కాంగ్రెస్- కమ్యూనిస్టు పార్టీలే ఉన్నాయి. అక్కడ ఎవరు గెలిచినా.. కేంద్రంలో బీజేపీ రాకూడదన్నదే మా లక్ష్యం. ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారు. అన్నదాతలపై యుద్ధం సరికాదు.రాముడిని, కృష్ణుడిని అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్లను కలిసే మోడీ సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడో బీజేపీ సమాధానం చెప్పాలి?. ప్రజలకు మేలు చేసి ఉంటే ఇన్ని జిమ్మిక్కులు చెయ్యాల్సిన అవసరం వచ్చేదికాదు’ అని అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
‘అడ్మినిస్ట్రేషన్‌ను ఉపయోగించుకొని ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. లిక్కర్ స్కాంలో అసలు నిందుతులను వదిలి కేజ్రీవాల్ టీంను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడి విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారు.17ఏ కత్తి పెట్టి నారా చంద్రబాబును లొంగదీసుకోవలనే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. వైఎస్ జగన్ ఎప్పుడో కేంద్రానికి లొంగిపోయాడు. 45వేల కోట్లు దోచిన 11 కేసుల్లో నిందుతుడిగా ఉన్న ఆయనపై చర్యలు లేవు. పిరికిపంద రాజకీయాలు చేసేవారు రాజకీయాల్లో ఉండటం సరికాదు. సొంత ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టొద్దు. జగన్ తన తండ్రి పేరు చెడగొట్టేందుకే పుట్టాడు. కేంద్రానికి అమ్ముడుపోయి తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. విభజన హామీల అమలు చేయకపోయినా.. బీజేపీ కాళ్ళు పట్టుకోవడం దారుణం. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి బీజేపీ, చంద్రబాబు, జగన్‌లకు వ్యతిరేకంగా పోరాడుతాం’ అని నారాయణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!