CPI Narayana: కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ లో జోష్ పుంజుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు రాజకీయ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాటలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇంకా కొన్నినెలల్లో రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలుకానుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. ఆ తర్వాతనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాజకీయ పరిణామాలు మారాయన్నారు.
Read Also:Thailand Elections: ఆర్మీ పాలనకు చరమగీతం.. థాయ్ ఎన్నికల్లో మూవ్ ఫార్వార్డ్ పార్టీ గెలుపు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణలో ఇప్పుడు కొత్త పొత్తు ఆప్షన్ ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ చెప్పారు. సీపీఐతో కలిసి పనిచేసే విషయంలో కేసీఆర్ మౌనంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యామ్నాయాలు వెతకడానికి ముందు ఆయన స్పందన కోసం వెయిట్ చేస్తామన్నారు. గత నవంబరులో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి మద్దతు కోరుతూ బీఆర్ఎస్ వామపక్షాలను ఆశ్రయించింది. మునుగోడు నియోజకవర్గంలో గణనీయమైన క్యాడర్ బేస్ ఉన్న వామపక్షాల మద్దతు ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని విస్తృతంగా విశ్వసిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడంపై బీఆర్ఎస్ నుంచి స్పందన రాకపోతే వామపక్షాలు కాంగ్రెస్ తో చేతులు కలపవచ్చనే ఊహాగానాలకు తెరలేపాయి.
Read Also:SSMB 28: మూడు నెలల యుద్ధానికి సిద్ధం… మూడు టైటిల్స్ కన్సిడరేషన్ లో