Site icon NTV Telugu

CPI Narayana: అమరావతి పనులపై నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ బాధ్యత మోడీదే..!

Cpinarayana

Cpinarayana

CPI Narayana: అమరావతి రీలాంచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పది సంవత్సరాలకు రాజధాని నిర్మాణానికి పునాదిరాయి వేశారు.. అయితే, గత ఐదు సంవత్సరాలు అమరావతి పనులు ఆగిపోయినందుకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.. దేశంలో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సింది.. అలా ఇవ్వకుండా అప్పు ఇప్పించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.. అమరావతి పునఃనిర్మాణం సభలో ప్రధాని మోడీ ప్రత్యేక హోదా మాట ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు నారాయణ..

Read Also: UP : కారును హెలికాప్టర్ చేసేశాడు.. పోలీసులు దాన్ని ఏం చేశారంటే..? (వీడియో)

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తోందన్నారు నారాయణ.. 2029 కల్లా కుల గణన పూర్తిచేసి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.. రాష్ట్రంలో కోడికత్తి, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులు అలానే ఉన్నాయి.. ఆ కేసులను కూడి నిగ్గు తేల్చాలి అని సూచించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..

Read Also: Karnataka: టెన్త్ పరీక్షల్లో అంధ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ… 566 మార్కులు తెచ్చుకున్న జాహ్నవి

కాగా, శుక్రవారం రోజు అమరావతి రీలాంచ్‌లో పాల్గొన్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు.. ఈ రోజు సోషల్‌ మీడియా వేదికగా.. ధన్యవాదాలు తెలిపారు.. “అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏపీలోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది. అమరావతి భవిష్యత్‌ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది.. ఇది ఏపీ అభివృద్ధి పథాన్ని మెరుగు పరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నాకు మంచి మిత్రుడు, సీఎం చంద్రబాబుకి అమరావతి పట్ల ఉన్న దార్శనికత, రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను” అంటూ ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొనగా.. “రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లిన మీడియా, సోషల్‌ మీడియాకి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు.. ప్రజల సహకారంతో, కేంద్రం మద్దతుతో పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్‌ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం.. మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు..

Exit mobile version