NTV Telugu Site icon

CPI Narayana: ముందస్తు ఎన్నికలు జరిపితే.. మోడీ ముందే ఇంటికి పోతాడు..

Cpi Narayana

Cpi Narayana

దేశంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యనించారు. వన్ నేషన్, వన్ పార్టీ, వన్ పర్సన్.. ఆర్ఎస్ఎస్ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలని నారాయణ చెప్పారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌కు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం అక్కర్లేదు.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే పద్దతికాదు.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ ప్రక్రియ అయినా నిర్వహించాలని సీపీఐ నారాయణ అన్నారు.

Read Also: Coffee Facts : ఒక నెల పాటు కాఫీని తాగకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

బీజేపీ పేరు మోసిన పెద్దవాళ్లను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. జమిలి ఎన్నికలపై చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు.. ఇండియా కూటమి బలపడకుండా ముందుగా తాము బయటపడాలని బీజేపీ చూస్తుందని ఆయన విమర్శించారు.”ఇండియా” కూటమి సమావేశంతో ప్రధాని మోడీ భయపడుతున్నారు.. ముందస్తు ఎన్నికలు జరిపితే, ముందే మోడీ ఇంటికి పోవడం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Supreme court: ” చెల్లని వివాహాల” ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుంది..

జీ-20 సమావేశాల పేరుతో “కమలం” గుర్తును కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నారు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చంద్రమండంలో రోవర్ లాండ్ అయిన ప్రదేశానికి “శివశక్తి” అని పేరు పెట్టారు.. ఈ రకంగా వీలైన చోటల్లా మతాన్ని జోడించే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకోడానికి మన దేశం కాదు చంద్ర మండలం అని ఆయన చెప్పారు. వీలైన చోటల్లా మతాన్ని జోడించి బీజేపీ రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు.. “ఒకే భాష, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే లీడర్” అన్నది వాళ్ల సిద్ధాంతమే అని సీపీఐ నారాయణ వెల్లడించారు.

Show comments