CPI Narayana: ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు కన్నయ్యపై దాడులు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందన్నారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని.. ఏపీలో ప్రభుత్వం మారుతుందన్నారు. ప్రస్తుతం ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీనే అంటూ తీవ్రంగా విమర్శించారు.
Read Also: Chintamaneni Prabhakar: అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు..
అవినీతిని ఎన్నిరకాలుగా చేయవచ్చో జగన్ మోహన్ రెడ్డి వద్ద నేర్చుకోవాలని.. చంద్రబాబు నాయుడు బ్రతుకు తెరువు రాజకీయాల కోసమే మోడీతో కలిశారని ఆయన విమర్శలు గుప్పించారు. 97 శాతం రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయన్నారు. మొట్టమొదటగా రాజకీయాలను డబ్బుతో నడిపించింది చంద్రబాబు నాయుడే అంటూ వెల్లడించారు. గుజరాత్‌లోని ముందనార్ పోర్టు నుంచి గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు డీజీపీని మార్చక పోతే రాష్ట్రం వల్లకాడు అయ్యేదన్నారు. ఎన్నికల తరువాత పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరిగాయన్నారు. ఓటమి దిశగా ఉన్న వైసీపీ వారు దాడులకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణలు చేశారు.
