NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao: సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదు..

Kunamneni

Kunamneni

కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులను బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. సినీ రంగంలో మార్పులు చేర్పులు అవసరం అని కూనంనేని సాంబశివరావు అభిప్రాయ పడ్డారు. మరోవైపు.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ.. గతం కంటే కొంత బెటర్‌గా ఉన్నాడన్నారు. బాలుడు పూర్తిగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Read Also: Supreme Court: ఎన్నికల నిబంధనల్లో మార్పులపై సుప్రీంలో కాంగ్రెస్ సవాల్

మరోవైపు.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను సీపీఎం నేతలు పరామర్శించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నేతలు DG నరసింగరావు, శ్రీనివాస్ రెడ్డి కిమ్స్‌కి చేరుకుని శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. కిమ్స్ ఆస్పత్రికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను చూసి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Read Also: PM Modi: రేపు మధ్యప్రదేశ్‌లో మోడీ పర్యటన.. కెన్-బెత్వా నదుల లింక్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన