NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao : జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ లో స్పీకర్ చైర్‌కు గౌరవం ఇవ్వడం సభ్యులందరి బాధ్యత అని అన్నారు. సభ్యులు సభలో సంయమనంతో, ఆచితూచి మాట్లాడాలని సూచించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వానికి కూనంనేని సూచించారు. ఈ సందర్భంగా, సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవడం అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై గతంలో చర్యలు తీసుకున్న ఉదాహరణలను ప్రస్తావిస్తూ, తెలంగాణలోనూ అదే విధంగా నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. సభలో మాట్లాడుతూ, “మీరు మేము ఎన్నకుంటేనే స్పీకర్ అయ్యారు. సభ మీ ఒక్కరిదీ కాదు, అందరదీ” అని జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల డిమాండ్ చేసినా ఆయన క్షమాపణ చెప్పకపోవడంతో స్పీకర్ ఆయనను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

CP CV Anand: 35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హోలీ, రంజాన్ రెండో శుక్రవారం.. సీవీ కీలక సూచనలు…