NTV Telugu Site icon

Ramakrishna: పొత్తులపై సీపీఐ రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌కు ఆ విషయం చెబుతాం..!

Ramakrishna

Ramakrishna

Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా ఎన్నికల పొత్తులపై హాట్‌ హాట్‌గా చర్చ సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేదా టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికలు వెళ్తాయా అనే విషయం తెలియాల్సి ఉంది.. ఇక, బీజేపీని దూరంగా పెడితే తాము కూడా పొత్తుకు సై అంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.. పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పార్టీలతో మేం కలిసి పనిచేస్తున్నాం.. మేం అందరం కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.. అయితే, బీజేపీతో కలసి పోటీ చేయవద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు చెబుతాం అన్నారు. పాచిపోయిన లడ్డూలు.. మంచి లడ్డూలు ఎలా అయ్యాయో పవన్ కల్యాణ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు సీపీఐ నేత రామకృష్ణ.

Read Also: CM YS Jagan: టెన్త్‌ టాపర్లకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌..

మరోవైపు.. పోలీసుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా జీవో 1 ఉందన్నారు రామకృష్ణ.. విజ్ఞత లేకుండా మరల జీవో ఇస్తామనడం పోలీసు రాజ్యం నడపాలనా? పోలీసు రాజ్యం నడపడానికి సీఎం అవసరమా? అని ప్రశ్నించారు. పోలీసు రాజ్యం నడపాలంటే డీజీపీని సీఎం సీట్లో కూర్చోపెట్టాలన్న ఆయన.. కొత్త జీవో తెస్తే మేం ప్రత్యక్ష ఆందోళనకు సమాయుత్తం అవుతాం అన్నారు.. ఇళ్ల స్ధలాల అంశం కంటే ముందు అమరావతి రాజధాని ఉందా లేదా చెప్పాలి అని డిమాండ్ చేశారు.. రాజధాని విశాఖపట్నమా..? అమరావతా..? స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్న ఆయన.. సెంటు భూమి ఏం చేసుకోవాలి.. నీ బాత్ రూం అంత కూడా పేదవాడికి ఇవ్వరా..? అని ఫైర్‌ అయ్యారు. పేదవారిని బిక్షగాళ్ళుగా మారుస్తున్నారు.. ఇందిరాగాంధీ హయాంలో 5 సెంట్లు ఇచ్చారు.. ఇప్పుడు సెంట్‌ భూమి ఏం చేసుకోవాలని అని నిలదీశారు. రెండు లేదా మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇసుక, సిమెంట్ ఉచితంగా ఇచ్చి.. ఒకొక్కరికి 5 లక్షలు ఇవ్వాలని కోరారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.