CP Sajjanar: వేకిల్ సీజ్, 10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష.. న్యూ ఇయర్ వేళ సీపీ సజ్జనార్ వార్నింగ్!
- డ్రంకెన్ డ్రైవ్‌ను పర్యవేక్షించిన సీపీ సజ్జనార్
- డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి సీపీ కౌన్సెలింగ్
- న్యూ ఇయర్ వేళ సీపీ సజ్జనార్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పోలీసు కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా.. సీపీ పాల్గొని తనిఖీల విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీసు సిబ్బందికి సూచనలు ఇవ్వడమే కాకుండా.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సజ్జనార్ వివరించారు. క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
‘ప్రతి రోజు మీడియాలో చెపుతూనే ఉన్నాం. అయినా చదువుకున్న వారు కూడా ఇలా డ్రింక్ చేసి వాహనాలు డ్రైవ్ చేస్తే ఎలా?. క్రిస్టమస్, న్యూ ఇయర్ సందర్భంగా వారం రోజుల నుంచి నగరంలో సెలబ్రేషన్స్‌పై పలు సూచనలు చేశాము. పబ్‌కి వెళ్లే వారు తమ డ్రైవర్లను వెంట తెచ్చుకోవాలి. క్యాబ్ బుక్ చేసుకోవాలి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ చేయాలని ఆదేశించాం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబరు 31 రాత్రి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కొనసాగుతాయి. నగరంలో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు ఉంటాయి’ అని సీపీ సజ్జనార్ చెప్పారు.
Also Read
- Britain Heatwave: భారత్‌లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్‌లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Smartphone Restart Benefits: స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
Also Read: Real Estate Company: రెచ్చిపోయిన రియల్ ఎస్టేట్ సంస్థ.. అర్ధరాత్రి బౌన్సర్లతో యజమానులపై దాడి!
‘మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు. ఇచ్చిన వారిపై కూడా చర్యలు ఉంటాయి. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తాం. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తాం. అంతేకాదు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదు’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వాహనదారులను హెచ్చరించారు.
తాజావార్తలు
-
Britain Heatwave: భారత్‌లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్‌లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?