Hyderabad: సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సంచలన వీడియో విడుదల..
- సంధ్య థియేటర్ ఘటనపై వీడియో విడుదల చేసిన పోలీసులు
- బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని అల్లు అర్జున్‌కు చెప్పేందుకు ప్రయత్నించాం
- మేనేజర్ తాను చెప్తా అన్నాడు..- ఏసీపీ రమేష్
- దయచేసి థియేటర్ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారు- ఏసీపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ వీడియోను విడుదల చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీవీ ఆనంద్.. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనను వివరించారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్‌హెచ్‌వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని సీపీ పేర్కొన్నారు. విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత కానీ.. అల్లు అర్జున్ బయటకు రాలేదని సీపీ తెలిపారు.
Allu Arjun: 2 వేల కోట్లు కలెక్ట్ చేశారు.. బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముంది: మంత్రి
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. బయట తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అనే విషయాన్ని అల్లు అర్జున్‌కి చెప్పేందుకు వెళ్తుండగా.. మేనేజర్ నేను చెప్తాను అన్నాడని అన్నారు. దయచేసి వెళ్ళండని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారన్నారు. కానీ నేను సినిమా మొత్తం చూసిన తర్వాతే వెళ్తాను అని అల్లు అర్జున్ అన్నారన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయం అల్లు అర్జున్ దృష్టికి తాను తీసుకువెళ్లానన్నారు. ఓ మహిళ చనిపోయింది.. బాబు సీరియస్ ఉన్నాడని అల్లు అర్జున్‌కు చెవిలో చెప్పాను.. నేను సినిమా చూశాకే వెళ్తాను అని అల్లు అర్జున్ తనకు చెప్పాడని అన్నారు. చిక్కడపల్లి సీఐ, రాజు నాయక్ మాట్లాడుతూ.. రేవతిని, చిన్న బాబు తేజను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించానని అన్నారు. ఎస్సై మౌనిక, తాను రేవతికి సీపీఆర్ చేశాం.. కాపాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. కానీ తమ ముందే రేవతి ప్రాణాలు పోయాయని తెలిపారు. తొక్కిసలాటలో తన ప్రాణాలు కూడా పోయేవని సీఐ అన్నారు.
Abhijeet : “గాంధీ పాకిస్థాన్ కి పితామహుడు.. భారత్‌కి కాదు.” సింగర్ సంచలన వ్యాఖ్యలు
సీపీ వార్నింగ్:
సీపీ సీవీ ఆనంద్ బౌన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాట తీస్తామని అన్నారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీనే భాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. బౌన్సర్లను పెట్టుకున్న వాళ్ళదే పూర్తి బాధ్యత అని సీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!