NTV Telugu Site icon

Cow Dung : పేడండి.. పేడ.. స్వచ్ఛమైన ఆవు పేడ..

Cow Dung

Cow Dung

తెలుగువారు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు… ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నవారంతా.. సొంతూళ్లకు పయనమవుతుంటారు. విదేశాల్లో ఉన్నవారు సైతం సంక్రాంతి పండుగకు సొంతూరుకు చేరుకొని బంధుగనంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే.. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ముగ్గులు. ఇంటి ముందు రకరకాల అందమైన ముగ్గులు వేసి అందులో ఆవుపేడను గొబ్బెమ్మగా పెడుతుంటారు. అయితే.. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. గతంలో ఆన్‌లైన్‌లో పిడకలు అమ్ముతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు గొబ్బెమ్మలకోసం పేడను అమ్ముతుండటం విశేషం. పేడండి.. పేడ.. స్వచ్ఛమైన పేడ అంటూ.. నల్గొండలో మహిళలు కొద్దిపాటి ఆవు పేడను రూ.30 నుంచి రూ.40కి విక్రయిస్తూ కనిపించారు.

 

Also Read : China: చైనాలో కొవిడ్ కల్లోలం.. 35 రోజుల్లోనే 60 వేల మరణాలు

వారు తెచ్చిన ఆవు పేడ మొత్తం పట్టణంలోకి రావడంతో రెండు గంటల్లోనే అమ్ముడుపోయాయి. నల్గొండలోని రామగిరిలో పేడను విక్రయిస్తున్న పెద్ద సూరారం గ్రామానికి చెందిన గుండె లక్ష్మమ్మ అనే మహిళ మాట్లాడుతూ శుక్రవారం నుంచి ప్రతిరోజు దాదాపు 10 కిలోల ఆవు పేడ విక్రయిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి రోజున ఆదివారం డిమాండ్ మరింత ఎక్కువగా ఉండవచ్చని, తాను తెచ్చిన పేడ రెండు గంటల్లోనే అమ్ముడుపోయిందని ఆమె అన్నారు. మరో మహిళ, కె రమ్య మాట్లాడుతూ, గొబ్బెమ్మను రంగోలిలో ఉంచడం వల్ల సంక్రాతి సమయంలో గొబ్బెమ్మ యొక్క ఆచార ప్రాముఖ్యతతో పాటు సాంప్రదాయకమైన రూపం వస్తుంది. పట్టణాలు మరియు నగరాల్లో ఆవు పేడ దొరకడం చాలా కష్టమైన పని కాబట్టి, సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతిని జరుపుకోవడానికి పేడను విక్రయిస్తు్న్నట్లు తెలిపింది.

Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

Show comments