Covid Cases: తెలంగాణలో విస్తరిస్తున్న కోవిడ్… పొంతన లేని లెక్కలు ప్రకటిస్తున్న సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Cases: తెలంగాణలో అన్నీ జిల్లాలకు కోవిడ్ విస్తరిస్తుంది. అత్యధికంగా హైదరాబాద్ లోనే కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 63 కేసులు కాగా.. కేవలం హైద్రాబాద్ లో 53 కొవిద్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే జిల్లాలలో కూడా వందల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన కేసుల వివరాలు వైద్యశాఖ బులిటెన్ లో చూపించడం లేదు. వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా సర్కారు లెక్కలు ఉంటున్నాయని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. నిన్న కేవలం 8 కేసులు వచ్చినట్లు కరోనా బులిటెన్ విడుదల చేయడంతో పలు అనుమానం వ్యక్తమవుతున్నాయి. 1333 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే కేవలం 8 కేసులు అంటూ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 ఆక్టివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మిగితా వారు డిశ్చార్జ్ అవ్వగా.. నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చినట్టు సమాచారం. దీంతో ప్రజలకు సర్కారు కరోనా లెక్కలను లైట్ తీసుకుంటున్నారు. మాస్క్ లు ఖచ్చితంగా వాడాలని వైద్యులు సూచిస్తున్న పట్టించుకోవడం లేదు. మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతాయనే టెన్షన్ లో వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అందుకు అనగుణంగా ఆస్పత్రులను ఆరోగ్య శాఖ సన్నద్ధం చేస్తున్నారు.
Read also: Kajal Aggarwal: చిట్టిపొట్టి దుస్తుల్లో కాజల్ అగర్వాల్ అందాల హొయలు…
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
రానున్న నాలుగు వారాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే జనవరి మొదటి వారంలో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో INSACOG నివేదికపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు, 6 రాష్ట్రాల్లో JN.1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌లలో కేసులు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినప్పుడు, JN.1 సబ్-వేరియంట్ కనుగొనబడింది. ఇప్పటివరకు JN.1 సబ్ వేరియంట్ కేసులు 69కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గోవాలో 34 మంది, కర్ణాటకలో 8, కేరళలో 6, మహారాష్ట్రలో 9, రాజస్థాన్‌లో 5, తమిళనాడులో 4 మందికి పాజిటివ్ పరీక్షలు చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల తర్వాత రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!