Covid BF-7 Variant: బీఎఫ్-7 వేరియంట్ తీవ్రత భారత్‌లో అంతగా ఉండకపోవచ్చు.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid BF-7 Variant: భారత్‌లో కరోనా బీఎఫ్-7 వేరియంట్ తీవ్రత చైనాలో ఉన్నంతగా ఉండకపోవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. భారతీయులు ఇప్పటికే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నందున తీవ్రత అంతగా ఉండకపోవచ్చని వెల్లడించారు. కానీ కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆయన చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్లు రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. టీకాలు వేసినా, కొన్నిసార్లు మునుపటి వేరియంట్‌ల బారిన పడిన వ్యక్తులకు కూడా సోకుతుందని అన్నారు.
బీఎఫ్-7 వేరియంట్ తీవ్రత డెల్టాలో ఉన్నంతగా లేదని ఆయన చెప్పారు. ఎందుకంటే మనకు కొంతవరకు రోగనిరోధక శక్తి ఉందన్నారు. భారత్‌లో 4 బీఎఫ్-7 వేరియంట్ కేసులు నమోదైనట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. భారత్‌లో ప్రమాదకరమైన డెల్టా వేవ్‌ను ఎదుర్కొన్నామని.. అప్పుడు టీకా వేయించామన్నారు. అనంతరం ఒమిక్రాన్ వేవ్ వచ్చిందని.. ఆ సమయంలో బూస్టర్ డోసులను కొనసాగించామన్నారు. చైనాలో జరుగుతున్నట్లుగా భారత్‌లో జరగదని ఆయన చెప్పారు. భారతదేశంలో తాజాగా 221 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసులు 3,424కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Also Read
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
China On Relations With India: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత్‌తో సంబంధాలపై చైనా
చైనా అనుసరిస్తున్న ‘జీరో కొవిడ్ పాలసీ’ ఆ దేశంలో కరోనా కేసులు వ్యాప్తి చెందడానికి ఒక కారణమని అధికారి వెల్లడించారు. తక్కువ టీకా స్థాయిలు కూడా తీవ్రతకు దోహదపడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.ఈ సమయంలో భారతదేశంలో మళ్లీ కరోనా వేవ్‌లు ఉండవచ్చని లేదా ఉండకపోవచ్చని కచ్చితంగా చెప్పలేమని.. కానీ ప్రస్తుతానికి అది ఆందోళన కలిగించే విషయంగా కనిపించడం లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ పరీక్షలు, చికిత్స, టీకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు. కావున భయపడాల్సిన పని లేదన్నారు.
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!