NTV Telugu Site icon

Covid-19: కొవిడ్‌ పుట్టుక చైనా ల్యాబ్‌ నుంచే..!

Corona

Corona

Covid-19: కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనానే అని పలు దేశాలు నిందించిన సంగతి తెలిసింది. ఈ మహమ్మారి చైనా ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందంటూ పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా కొవిడ్ పుట్టుక చైనాకు చెందిన ల్యాబ్‌ నుంచే జరిగిందని అమెరికాకు చెందిన కీలకమైన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ విషయంపై అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ అవ్రిల్‌ హైన్స్‌ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది.అమెరికాలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో జాతీయ రీసెర్చ్‌ సెంటర్‌ను ఆ సంస్థ పర్యవేక్షిస్తుంది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ వైరస్‌ ఎలా పుట్టిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్‌ ల్యాబ్‌ లీక్‌ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొనడం గమనార్హం.

Read Also: Zelensky: వ్లాదిమిర్ పుతిన్ తన దగ్గర వాళ్లతోనే చంపబడతాడు.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

గతంలో అమెరికాకు చెందిన పలు డిపార్ట్‌మెట్లు కరోనా పుట్టుకపై అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. తాజాగా 5 పేజీల నివేదికతో ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కూ చైనా వైపే చూపించింది. ఇదిలా ఉండగా,..నాలుగు ఏజెన్సీలు కరోనా సహజంగానే పుట్టుకొచ్చిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్‌ వెల్లడించారు. గతంలో ఎఫ్‌బీఐ కూడా చైనాలోని ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీకై ఉంటుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇప్పటికే పలు ఇంటెలిజెన్స్‌ సంస్థలను కరోనా మహమ్మారిపై వీలైనంత ఎక్కవ సమాచారం సేకరించాలని సూచించారు. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ఉద్భవం గురించి ప్రకటించేవరకు తమ పరిశోధనలు కొనసాగుతున్నాయని ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

Show comments