NTV Telugu Site icon

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్‌పై స్టే విధించిన కోర్టు..

Arvind Kejriwal

Arvind Kejriwal

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు నుంచి మంజూరైన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణ వరకు బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్‌ బెయిల్‌పై విడుదల చేసిన ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి వంటి ప్రధాన పదవిని కలిగి ఉన్నారని.. ఇప్పుడు ఆయనను విడుదల చేస్తే..దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈడీ తన SLP లో పేర్కొంది. కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. పిటిషన్‌పై ముందస్తు విచారణ అవసరం లేదని పేర్కొంది.

READ MORE: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!

కేసుపై విచారణ పూర్తయ్యే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని హైకోర్టు తెలిపింది. ఈ కేసుపై విచారణ పూర్తయ్యే వరకు కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాలేరని స్పష్టంగా అర్థమవుతోంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్‌ను కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు పేర్కొంది. కేజ్రివాల్ కు బెయిల్ మంజూరు కావడం ఈడీకీ ఏమాత్రం ఇష్టం లేదు. నిజానికి, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ లంచం డిమాండ్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.

READ MORE: Nvidia Mcap: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్‌విడియా

ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికలు ముగిసిన అనంతరం తిరిగి తీహార్ జైలుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు కానందున విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే ఉంటారు.