పబ్లిక్ ప్లేసులను కూడా ప్రైవేట్ ప్లేసులుగా ఫీలవుతున్నారు కొందరు ప్రేమికులు. ఎక్కడ ఉన్నాము? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్న సంగతి మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రేమ జంట వెకిలి చేష్టలకు పాల్పడింది. రిల్స్ కోసం రన్నింగ్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. బైక్ పై అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ వీడియో తీసుకుంది ప్రేమ జంట. ఆరంగర్ ఫ్లైఓవర్ పై ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని వేగంగా దూసుకెళ్లాడు ప్రియుడు. బైక్ పైనే ప్రియుడిని హగ్ చేసుకుని ప్రియురాలు కూర్చుంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఈ తతాంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది.
Also Read:Operation Baam: బలూచిస్తాన్ ఎప్పటికీ పాకిస్తాన్‌లో భాగం కాదు.. పాక్ కు హెచ్చరిక
ప్రేమ జంట అసభ్యకర చర్యను చూసిన కొందరు వాహనదారులు వారించే ప్రయత్నం చేశారు. అసభ్యకర రీతిలో వేగంగా వెళుతూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ప్రేమ జంటపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇది వరకు కూడా ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణించిన వారికి పోలీసులు తగిన గుణపాఠం నేర్పారు. హైదరాబాద్ ప్రేమ జంటపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
