పబ్లిక్ ప్లేసులను కూడా ప్రైవేట్ ప్లేసులుగా ఫీలవుతున్నారు కొందరు ప్రేమికులు. ఎక్కడ ఉన్నాము? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్న సంగతి మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రేమ జంట వెకిలి చేష్టలకు పాల్పడింది. రిల్స్ కోసం రన్నింగ్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. బైక్ పై అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ వీడియో తీసుకుంది ప్రేమ జంట. ఆరంగర్ ఫ్లైఓవర్ పై ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని వేగంగా దూసుకెళ్లాడు ప్రియుడు.…