Site icon NTV Telugu

Couple Friendly Trailer: ఎంత మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసావ్?

Couple Friendly Trailer

Couple Friendly Trailer

Couple Friendly Trailer: అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యువ హీరో సంతోష్ శోభన్.. మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ రోజు మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక యువ జంట మధ్య సాగే సహజీవనం, వారి ప్రయాణంలో ఎదురయ్యే సరదా సన్నివేశాలు, కుటుంబాల మధ్య తలెత్తే సంఘర్షణలతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

READ ALSO: Duddilla Sridhar Babu : కేంద్ర బడ్జెట్‌పై షాకింగ్ కామెంట్స్.. 42 హామీలు ఏమైనట్టు.?

ఈ ట్రైలర్‌లో మేకర్స్ కేవలం హాస్యం మాత్రమే కాకుండా, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశారు. ఎంత మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసావ్? అని హీరోయిన్ అడగ్గా.. ‘నా జీవితం తప్ప నేను ఇంకెవరి జీవితాన్ని పాడుచేయలేదు’ అని హీరో చెప్పే సంభాషణలు ట్రైలర్‌లో హైలెట్‌గా నిలుస్తాయి. ఈ ట్రైలర్ ముగింపులో హీరో పలికే మాటలు గుండెను హత్తుకునేలా ఉంటాయి. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే యూవీ క్రియేషన్స్ సంస్థ తమదైన శైలిలో ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు కనిపిస్తోంది. సంతోష్ శోభన్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, మానస వారణాసి వెండితెరకు కొత్త గ్లామర్‌ను తెచ్చింది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ పేరుతో వస్తున్న ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

READ ALSO: Dhanush D55 Film: D55 క్రేజీ అప్‌డేట్.. ధనుష్ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు

Exit mobile version