Site icon NTV Telugu

Corona: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్.. యమా డేంజరట!

Corona Cases In Inidia

Corona Cases In Inidia

Corona: ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీసారీ నేనెక్కడికీ పోలేదు.. ఉన్నానంటూ కరోనా మహమ్మారి గుర్తుచేస్తూనే ఉంది. మొన్నటిదాకా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. పండుగ సీజన్ లో రోజువారీ కేసుల సంఖ్య పెరగడంతో పాటు మహారాష్ట్రలో కొత్త, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా వెలుగు చూసిన కరోనా వేరియంట్లలో ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందేది ఎక్స్ఎక్స్ బీ అని నిపుణులు భావిస్తున్నారు. గత వారంలో ముంబై, థానే, పూణే, రాయ్‌గడ్‌లోని ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ వేరియంట్ వెలుగు చూటడం ఆందోళన రేకెత్తించింది. ఈ నెల 10–16 తేదీల మధ్య కేసుల సంఖ్య 17.7 శాతానికి పైగా పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read Also: Madhya Pradesh:చిన్నారి మృతదేహంతో మేనమామ.. టిక్కెట్ కి కూడా డబ్బుల్లేవు

ఎక్స్ ఎక్స్ బీ వేరియంట్ ఇప్పటిదాకా 17 దేశాలకు వ్యాపించింది. బీఏ 2.75, బీజే.1 సబ్-వేరియంట్‌ల కంటే దీని వృద్ధి ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత ఆరు నెలల్లో భారత దేశంలో దాదాపు 90 శాతం కొత్త ఇన్‌ఫెక్షన్‌లు బీఏ .2.75 వల్ల సంభవించాయని, ఎక్స్ ఎక్స్ బీ 7 శాతంగా ఉందని తేలింది. ఈ సంవత్సరం ఆగస్టులో సింగపూర్ లో వెలుగు చూసిన ఎక్స్ ఎక్స్ బీ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎక్స్ ఎక్స్ బీ స్పైక్ ప్రోటీన్ పై ఏడు ఉత్పరివర్తనాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా తప్పించుకుంటుంది కాబట్టి వ్యాప్తి రేటు భారీగా ఉందని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మాస్కులు ధరించాలని సూచించారు.

Exit mobile version