India Corona: దేశంలో మళ్లీ 12 వేలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 10వేలకు దిగువన నమోదైన కేసులు.. నేడు మరోసారి 12వేలు దాటాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది వైరస్ బారినపడగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినుంచి 9,862 మంది కోలుకున్నారు. క్రమంగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో మొత్తం కేసులు 4,33,31,645కు చేరాయి. ఇందులో 4,27,25,055 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,903 మంది కరోనా రోగులు మృతిచెందారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం 81,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, 9,862 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పాజిటివిటీ రేటు 3.94 శాతానికి ఎగబాకింది. రికవరీ రేటు 98.60 శాతానికి తగ్గగా.. క్రియాశీల రేటు 0.19 శాతానికి పెరిగింది. కొత్త కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర(3,659), కేరళ(2,609) నుంచే వచ్చాయి. దిల్లీలో వెయ్యికి పైగా కొత్త కేసులు రాగా.. కర్ణాటక, తమిళనాడు, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 12.28 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.
తాజావార్తలు
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..
-
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
-
Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!