తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ డెంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. గడిచిన 24 గంటలలో తెలంగాణ రాష్ట్రంలో 2,319 కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే పెరిగాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటి కన్నా.. దాదాపు 400 కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ఈ రోజు 2,319 కరోనా కేసులు వెలుగు చూశాయని.. అలాగే కరోనా కారణంగా ఈ రోజు ఇద్దరూ మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
Read Also: పద్మాదేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్
కాగ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 474 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 18,339 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో 90 వేల 21 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా జనవరి మొదటి వారంలో తక్కువగా ఉన్న కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యాఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
