పద్మాదేవేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆమె హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తమతో సన్నిహితంగా ఉన్న వారు కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేసుకోవాలని పద్మాదేవేందర్‌ సూచించారు. మరోవైపు వేగంగా వ్యాపించే వ్యాపించే ఒమిక్రాన్‌ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమైంది. ఇంకా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Read Also: ఊర్లకు వెళ్లే వారి కోసం బస్సు పాయింట్లను ప్రకటించిన టీఎస్‌ ఆర్టీసీ

రాష్ట్రంలో సుమారు 30 శాతం జనాభాకు వైరస్‌ సోకే అవకాశాలు ఉన్నాయని వైద్యాఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి తర్వాత కేసులు పెద్దసంఖ్యలో వస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఆస్పత్రులను సిద్ధం చేస్తోంది. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. ఆదివారం కూడా టీకా పంపిణీ చేపట్టాలని, పరీక్షలు తగ్గకుండా చూడాలని వైద్యాఆరోగ్య శాఖకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Latest Articles