Site icon NTV Telugu

Yashasvi Jaiswal: కట్టలు తెంచుకున్న కోపం.. అంపైర్‌పై జైస్వాల్..

Jaiswal

Jaiswal

భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో భారత -ఏ జట్టు రెండు టెస్లు మ్యాచ్ ల అనధికారిక సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. నిలకడగా ఆడుతూ 116 పరుగులతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎల్బీగా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన బంతి జైస్వాల్ ఫ్యాడ్స్ కు తగిలింది. దాన్ని అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. కానీ అంపైర్ నిర్ణయంపై యశస్వి సంతృప్తి చెందలేదు. అంపైర్ ఔట్ ఇచ్చినా క్రీజు నుంచి బయటకు వెళ్ళలేదు.

READ MORE: Secunderabad Railway Station: హనీమూన్ కి బయలుదేరిన యువకుడు.. వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి.. చివరకు

తాను నాటౌట్ అంటూ అంపైర్‌పై ఫైర్ అయ్యాడు. అంపైర్ మాత్రం అది కచ్చితంగా అవుట్ అని చెప్పడంతో చేసేదేం లేక మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ అనధికారిక మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో జురెల్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చితక్కొట్టాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో కేఎల్ రాహుల్ టెస్టుల్లో పర్మినెంట్‌గా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సెంచరీతో తన ఓపెనింగ్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. భవిష్యత్తులో టెస్టులకు యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

READ MORE: Hanumakonda: వాహ్ ఏం ఐడియా సర్.. అధిక సౌండ్ చేసే సైలెన్సర్లతో ఏం చేశారో చూడండి..

Exit mobile version