NTV Telugu Site icon

Mangalagiri Lakshmi Narasimha Swamy: వివాదాలకు కేంద్ర బిందువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం

Mangalagiri

Mangalagiri

మంగళగిరిలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం. ఇప్పుడు ఈ ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన దేవాలయంగా మరియు లక్ష్మీ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం రాజకీయాలకు వేదికగా మారింది, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఆనుకొని ఉన్న పెద్ద కోనేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా వార్తల్లో ఉంది. ఈ కోనేరు నుండి నీటిని తీసుకొని స్వామివారికి నిత్యం అభిషేకం చేయడం కోసం పాండవుల కాలంలో ఈ కోనేటిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఈ కోనేరు పునర్నిర్మాణం కొరకు వైసీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలు వెచ్చించి మరమ్మత్తులు నిర్వహిస్తుంది, కడపకు చెందిన ఓ కాంట్రాక్టర్ దీని మరమత్తులు చేపట్టారు.

Read Also: Cheetahs: ఈ సారి దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు.. వచ్చేది అప్పుడే?

స్థానిక ఎమ్మెల్యే నిత్యం ఈ కోనేరు వద్ద సంచరిస్తున్నారని, కాంట్రాక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బినామీ అని, నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా నీటిని తోడి, పూడిక తీయాలని నిర్ణయించి ఆ పనులు జరుగుతుండగా, కోనేటి అడుగు భాగంలో గుప్త నిధులు ఉన్నాయని ఒక వర్గం చెబుతుంది. అయితే ఇంత పురాతన కోనేటిని మరమ్మతులు చేసేటప్పుడు సీసీటీవీ తో భద్రత కల్పించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో మరియు నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు నిర్వహిస్తే పారదర్శకంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి స్థానిక ఎమ్మెల్యేని అధికారులని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ డిమాండ్ ను ఎవరు పట్టించుకోలేదు దాంతో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నేతలకు ఉన్న మరియు భక్తులు అనుమానాలను టిడిపి నేతలు వెల్లడించారు.

Read Also: Jagga Reddy : మంత్రి హరీష్‌రావును కలిసిన జగ్గారెడ్డి..

అయితే తమ ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదని పనులు పారదర్శకంగా జరగడంలేదని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై టిడిపి సీనియర్ నేత పోతినేని శ్రీనివాస్, తమ్మిశెట్టి జానకి దేవి లు మండిపడ్డారు. ఎంతో ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని పలు అనుమానాలకు తావిచ్చే విధంగా అధికారుల తీరు ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా అధికారులు స్పందించి భక్తుల మనోభావాలను గౌరవించాలని పలు ధార్మిక సంస్థలు కూడా కోరుతున్నాయి. అయితే ప్రశ్నించిన వారి గొంతు నొక్కే విధానంలో కేసులు పెడతారని భయంతో కొంతమంది భక్తులు బహిరంగంగా వ్యాఖ్యానించడానికి భయపడుతూ విమర్శలు చేయడం కనపడుతుంది.