Site icon NTV Telugu

BK Hari Prasad : ‘ఆ ఎమ్మెల్యే వ్యభిచారి’..కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్

Hari Prasad

Hari Prasad

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. రాష్ట్ర మంత్రి ఆనంద్ సింగ్‌తో పాటు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీలు మారిన వారు వ్యభిచారులతో సమానమంటూ మాట్లాడటం తీవ్ర దుమారానికి దారితీసింది. హోసపేట్‌లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో హరిప్రసాద్ మాట్లాడుతూ.. “ఆహారం కోసం ఒళ్లు అమ్ముకున్న మహిళల్ని వ్యభిచారులు అంటాం. డబ్బుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల్ని ఏమంటారో మీరే చెప్పాలి. ఆత్మగౌరవంతో పాటు అన్నీ అమ్ముకున్న లోకల్ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది” అని 2019లో బీజేపీలో చేరిన ఆనంద్ సింగ్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు హరిప్రసాద్.

Also Read : Ind vs NZ : టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌

అయితే.. కాంగ్రెస్ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలపై  బీజేపీ లీడర్ ఎస్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు. “కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రిని కుక్కతో పోల్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేల్ని వ్యభిచారులని మాట్లాడుతున్నారు. ఇదీ వారి సంస్కృతి. కాంగ్రెస్ ప్రేమను పంచుతుందని రాహుల్ గాంధీ అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఏమంటారో చూడాలని ఉంది” అని ప్రకాశ్ వ్యాఖ్యానించారు.

Also Read : SSMB 28: పాన్ ఇండియా సినిమాకి పునాది పడింది…

Exit mobile version