Site icon NTV Telugu

The Kerala Story : ఓటీటీలో అదరగొడుతున్న కాంట్రవర్షియల్ మూవీ..

Whatsapp Image 2024 02 19 At 10.59.32 Pm

Whatsapp Image 2024 02 19 At 10.59.32 Pm

అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అదే రేంజ్‍లోనే కాంట్రవర్షియల్ అయింది. ఈ చిత్రంపై చాలా వివాదాలు తలెత్తాయి.అలాగే, రాజకీయంగానూ ఈ చిత్రంపై తీవ్ర దుమారం రేగింది. 2023 మేలో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా సంచలన వసూళ్లను సాధించింది. సుమారు రూ.15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. అయితే సుమారు 9 నెలల తర్వాత ఇటీవలే కేరళ స్టోరీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.ది కేరళ స్టోరీ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఎంతో కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం జీ5 ఓటీటీలో స్టీమింగ్ అవుతోంది. భారీగా వ్యూస్ ను దక్కించుకుంటూ దూసుకెళుతోంది.ది కేరళ స్టోరీ చిత్రానికి లాంచ్ వీకెండ్‍లోనే 150 మిలియన్లకు పైగా వాచ్ మినిట్స్ వచ్చాయని జీ5 ఓటీటీ నేడు (ఫిబ్రవరి 19) వెల్లడించింది. అంటే మూడు రోజుల్లోనే ఈ చిత్రం 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటేసింది. రికార్డులను, హద్దులను ఈ సినిమా బ్రేక్ చేస్తోందంటూ జీ5 ఓటీటీ ఓ పోస్ట్ రిలీజ్ చేసింది. ది కేరళ స్టోరీ మూవీ చాలా వివాదాస్పదం కావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కి ఎంతో ఆలస్యమైంది. ఆరంభంలో ఓటీటీ హక్కులు ఏ ప్లాట్‍ఫామ్ తీసుకోవడం లేదని గతంలో దర్శకుడు సుదీప్తో సేన్ అన్నారు. అయితే, ఎట్టకేలకు జీ5 ఓటీటీ ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ తీసుకొని ఇప్పుడు స్ట్రీమింగ్‍కు తెచ్చింది.

Exit mobile version