The Kerala Story : ఓటీటీలో అదరగొడుతున్న కాంట్రవర్షియల్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అదే రేంజ్‍లోనే కాంట్రవర్షియల్ అయింది. ఈ చిత్రంపై చాలా వివాదాలు తలెత్తాయి.అలాగే, రాజకీయంగానూ ఈ చిత్రంపై తీవ్ర దుమారం రేగింది. 2023 మేలో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా సంచలన వసూళ్లను సాధించింది. సుమారు రూ.15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. అయితే సుమారు 9 నెలల తర్వాత ఇటీవలే కేరళ స్టోరీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.ది కేరళ స్టోరీ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఎంతో కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం జీ5 ఓటీటీలో స్టీమింగ్ అవుతోంది. భారీగా వ్యూస్ ను దక్కించుకుంటూ దూసుకెళుతోంది.ది కేరళ స్టోరీ చిత్రానికి లాంచ్ వీకెండ్‍లోనే 150 మిలియన్లకు పైగా వాచ్ మినిట్స్ వచ్చాయని జీ5 ఓటీటీ నేడు (ఫిబ్రవరి 19) వెల్లడించింది. అంటే మూడు రోజుల్లోనే ఈ చిత్రం 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటేసింది. రికార్డులను, హద్దులను ఈ సినిమా బ్రేక్ చేస్తోందంటూ జీ5 ఓటీటీ ఓ పోస్ట్ రిలీజ్ చేసింది. ది కేరళ స్టోరీ మూవీ చాలా వివాదాస్పదం కావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కి ఎంతో ఆలస్యమైంది. ఆరంభంలో ఓటీటీ హక్కులు ఏ ప్లాట్‍ఫామ్ తీసుకోవడం లేదని గతంలో దర్శకుడు సుదీప్తో సేన్ అన్నారు. అయితే, ఎట్టకేలకు జీ5 ఓటీటీ ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ తీసుకొని ఇప్పుడు స్ట్రీమింగ్‍కు తెచ్చింది.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Setting another milestone with its bold narrative! 150 million watch minutes and counting. 🙌🏼#TheKeralaStory streaming now, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah #TheKeralaStory #SaveOurDaughters@sudiptoSENtlm @Aashin_A_Shah @sunshinepicture @adah_sharma… pic.twitter.com/ukxF58PfZw
— ZEE5Official (@ZEE5India) February 19, 2024
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!