NTV Telugu Site icon

Kadiyam Srihari: బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామంటున్నారు..

Kadiyam

Kadiyam

హనుమకొండ జిల్లాలోని డి కన్వెన్షన్ హల్ లో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్లమెంట్ సన్నాహాకా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్వీ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గంకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. కడియం కావ్య స్థానికురాలే.. కొత్త మంది నాయకులు అవాస్తవాలు పలుకుతున్నారు.. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డాడు అని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి సేవాభావంతో రావాలి తప్ప.. వ్యాపారం చేసేందుకు కాదన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తాం అని చెబుతున్నారు అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Read Also: Civil Services Exam: స్వీపర్ కొడుకు సివిల్స్ సాధించాడు..

ఇక, దేశంలో దళితులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికోట్టాలి.. బీజేపీ నేతలు రామున్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.. కడియం కావ్యను గెలిపించాలి.. కడియం కావ్య గెలిస్తే వర్ధన్నపేటకు సాగు, తాగు నీటిని అందిస్తామన్నారు. రాష్ట్రానికి బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు ఏం చేయలేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్దే ఇప్పటికి కనిపిస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ స్థానాల్లో విజయం సాధించబోతుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.