NTV Telugu Site icon

BRS: ఎంపీ స్థానాలపై ఫోకస్.. జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు

Brs

Brs

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.

Read Also: Jagadish Reddy: ప్రజలు అడిగేది పథకాలు.. పత్రాలు కాదు

• 3న ఆదిలాబాద్
• 4న కరీంనగర్
• 5న చేవెళ్ల
• 6న పెద్దపల్లి
• 7న నిజామాబాద్
• 8న జహీరాబాద్
• 9న ఖమ్మం
• 10న వరంగల్
• 11న మహబూబాబాద్
• 12న భువనగిరి 

సంక్రాంతి అనంతరం.. 
• 16న నల్గొండ
• 17న నాగర్ కర్నూలు
• 18న మహబూబ్ నగర్
• 19న మెదక్
• 20న మల్కాజ్ గిరి
• 21 సికింద్రాబాద్, హైదరాబాద్ 

Read Also: Viral video : క్యాడ్బరి జేమ్స్ తో మ్యాగిని ఎప్పుడైన ట్రై చేశారా? ఇది చూస్తే మ్యాగీ జోలికే వెళ్లరు..

ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరికి పార్టీ ఆహ్వానించనుంది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు.