T. Harish Rao: హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కుట్ర.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ పై జరుగుతున్న కుట్రను ఆపాలంటే mlc గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హరీష్ రావు హాజరై మాట్లాడారు. గోదావరి నీళ్లను ఒక్క చుక్కా తీసుకోకద్దు అంటూ కొట్లాడామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం గోదావరి నీళ్లు కాపాడే ప్రయత్నమే చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని మోసం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనలేదని అంటున్నారన్నారు.
READ MORE: Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన హమాస్, హౌతీ, తాలిబాన్ లీడర్స్..
Also Read
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మేము చెప్పలేదంటున్నారని హరీష్ రావు అన్నారు. ఎన్నికలు అయిపోయాయి కాదా.. ఇక రేట్లు పెంచుతారన్నారు. భూముల రేట్లు పెంచుతారట.. కరెంటు రేట్లు పెంచుతారట.. సంక్షేమంలో కోత విధిస్తారని విమర్శించారు. ఇస్తా అన్న హామీలకు తూట్లు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడంతోనే మార్పు మొదలవుతుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పట్టభద్ర ఓటర్లను కోరారు.
కాగా.. శాసనమండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే.. వారిలో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఈసీ నియమించింది.
తాజావార్తలు
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..