NTV Telugu Site icon

Gujarat Elections 2022: గుజరాత్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక ముస్లిం

Muslim Mla

Muslim Mla

Gujarat Elections 2022: గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్‌ నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన ఇమ్రాన్ ఖేదావాలా 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ముస్లిం అభ్యర్థి. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లిం శాసనసభ్యులు ఉన్నారు, అందరూ కాంగ్రెస్‌కు చెందినవారే కావడం గమనార్హం. అహ్మదాబాద్ నగరంలోని జమాల్‌పూర్-ఖాడియా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఖేదావాలా గురువారం జరిగిన ఎన్నికల్లో 13,658 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా ఆరుగురు ముస్లిం అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపింది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఐదుగురు అభ్యర్థులు ఓడిపోయారు. 2017లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురు అభ్యర్థులలో ముగ్గురు విజయం సాధించారు. గుజరాత్ జనాభాలో దాదాపు 10 శాతం ముస్లింలు ఉన్నారు. అహ్మదాబాద్ జిల్లాలోని దరియాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్ బీజేపీకి చెందిన కౌశిక్ జైన్ చేతిలో ఓడిపోయారు. మోర్బి జిల్లాలోని వాంకనేర్‌లో ప్రతిపక్ష పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడు మహ్మద్ జావేద్ పిర్జాదా ఓటమిని చవిచూశారు.

Digital Payments: ఇండియాలో డిజిటల్‌ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు

కచ్ జిల్లాలోని అబ్దాసా స్థానంలో కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థి జాట్ మమద్ జంగ్ బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రద్యుమన్ సిన్హ్ జడేజా చేతిలో దాదాపు 9,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జమాల్‌పూర్-ఖాడియా, దరియాపూర్, జంబూసర్ అనే మూడు అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది, అయితే వారిలో ఎవరూ గెలవలేదు. మైనారిటీ వర్గానికి చెందిన 12 మంది ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అభ్యర్థులు పోటీలో ఉండగా, బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు, అయితే వారందరూ ఓడిపోయారు. వీరిలో ఇద్దరు ఏఐఎంఐఎం అభ్యర్థులు తమ నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల ముగిసిన ఎన్నికలలో గుజరాత్ చరిత్రలో ఏ పార్టీ కూడా సాధించని విధంగా బీజేపీ 156 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 17 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆప్ విజయం సాధించింది.