తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో.. తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో.. తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేస్తున్నారు. దీంతో.. తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Also: IC 814 hijack: ఉగ్రవాదుల్ని విడుదల చేయొద్దని బీజేపీకి చెప్పా.. హైజాక్ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా..
కేటీఆర్ లాంటి వల్లనే వదల్లేదు.. క్షమాపణ చెప్పాలని వారు కోరుతున్నారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడాడు.. పాడి కౌశిక్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మహిళ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో కాంగ్రెస్ మహిళా శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో.. కౌశిక్ రెడ్డి ఫోటోలు దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు.
Read Also: Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి కారుపై పడిన కంటైనర్, నలుగురు మృతి