త్వరలో కర్ణాటక రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల కోసం అధికార-ప్రతిపక్ష పార్టీలు భారీగా ప్రచారంతో పాటు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. దీంతో నిన్న ( సోమవారం ) అధికార బీజేపీ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. దీంతో ఇవాళ ( మంగళవారం ) కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.
Also Read : Vizag: విశాఖలో ఫ్లెక్సీల కలకలం..
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్, మహిళలకు నగదు-ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కర్ణాటకలో ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
Also Read : Snake Poison : బంగ్లా సరిహద్దులో కోట్ల విలువ చేసే పాము విషం స్వాధీనం..
మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు..
1. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్
2. కుంటుంబ పెద్దగా ఉండే ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేల నగదు పంపిణీ
3. నిరుద్యోగ గ్రాడ్జ్యువేట్స్ కు నెలకు రూ. 3 వేలు ( రెండేళ్ల వరకు )
4. డిప్లామా హోల్డర్స్ కు నెలకు. రూ. 1,500 ( రెండేళ్ల వరకు )
5. కేఎస్ఆర్టీసీ-బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణం.
6. నైట్ డ్యూటీ చేసే పోలీసు అధికారులకు నెలకు రూ. 5వేల స్పెషల్ అలోవెన్స్
7. బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధించే విధంగా నిర్ణయం తీసుకోవడం.
8. ఎస్సీ రిజర్వేసన్ 15 నుంచి 17 శాతానికి పెంచడం.. ఎస్టీ రిజర్వేషన్ 3 నుంచి 7 శాతానికి పెంపు
9. మైనార్టీ రిజర్వేషన్ 4 శాతానికి పునరుద్ధరించడం, లింగాయత్లు, వొక్కలిగ్గాలు, ఇతర సంఘాల సభ్యులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రచారం
Also Read : NTR 30: జాన్వీకి పోటీగా మహానటి రంగంలోకి…
అయితే 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ఈ నెల 10వ తారీఖున ఎలక్షన్స్ జరుగనున్నాయి. 13న తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వేలు బయటకొచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. మరి కొన్ని సర్వేలు మాత్రం హంగ్ వస్తుందని అంచనా వేస్తున్నాయి. మరి కన్నడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది వేచి చూడాలి…