NTV Telugu Site icon

Harish Rao: పొరపాటున కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే పదేళ్లు వెనక్కిపోతాం..

Harishrao

Harishrao

Harish Rao: పొరపాటున కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని మంత్రి హరీష్ రావు అన్నారు. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ అని అన్నారు. అధికారం మీద యావ ఎక్కువ అన్నారు. అబద్దాలతో అధికారం లోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ తో జాగ్రత్త గా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇస్తే 10ఏళ్ళు వెనక్కి పోతామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మన ఏళ్ల తో మన కన్ను పొడుచుకున్నట్టే అని తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష సీఎం కేసీఆర్ పాలన అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కంటే కాంగ్రెస్ అధికారాన్ని ఎక్కువగా ప్రేమిస్తోందని విమర్శించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్‌ ఇస్తున్నామని, మన రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామన్నారు. రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని అన్నారు. ఉమ్మడి పాలనలో కరువు కాటకాలతో సతమతమయ్యేవారని, నేడు హరితహారంగా మార్చామన్నారు. పొరపాటున అయినా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేళ్లు వెనక్కి వెళ్తుందని హెచ్చరించారు. దీంతో తెలంగాణ నేడు అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా ఉందని తేలింది. బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో అద్భుతం. కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామన్నారు. రైతుబంధు, ఆసరా పింఛన్లు పెంచబోతున్నట్లు తెలిసింది. ఐక్య మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు.
House Rent Hike: భారీ పెరిగిన ఇంటి అద్దెలు.. ఏ నగరంలో ఎంత పెరిగిందంటే ?