Narendra Modi: కాంగ్రెస్ పార్టీ కనీసం 50 సీట్లు కూడా గెలవలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 50 స్థానాల్లో కూడా గెలవదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా హస్తం పార్టీ కోల్పోతుందని పేర్కొన్నారు. ఒడిశాలోని కందమాల్‌లో ఇవాళ (శనివారం) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో చేపట్టిన పోఖ్రాన్ పరీక్షలు వరల్డ్ వైడ్ గా భారతదేశ ప్రతిష్టను పెంచాయని చెప్పారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా 500 ఏళ్ల ప్రజల నిరీక్షణకు బీజేపీ సర్కార్ తెరదించిందని వెల్లడించారు. ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం త్వరలోనే ఏర్పడుతుంది.. ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకున్న వారినే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
Read Also: CM YS Jagan: రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది..
Also Read
ఇక, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్‌ను గౌరవించండి అని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రధాని మోడీ రియాక్ట్ అయ్యారు. ఆర్థిక సమస్యల కారణంగా భారత్‌కు దూరమైన దాయాది దేశం తన అణ్వాయుధాలను విక్రయించాలని చూస్తోందని చెప్పారు. పాకిస్తాన్ అణు బాంబులతో భారత ప్రజలను భయపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. కాగా, పాక్‌లో అణుబాంబులు ఉన్నాయని హస్తం పార్టీ చెబుతోంది.. కానీ ఆ బాంబును ఎలా నిర్వహించాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. తమ బాంబులను అమ్మడానికి వారు ప్రయత్నిస్తున్నారు.. అలాగే, కాంగ్రెస్ బలహీనమైన వైఖరి కారణంగా జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని భరించవలసి వచ్చిందని ప్రధాన మంత్రి మోడీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!