NTV Telugu Site icon

Congress: ప్రపంచకప్ చూడటానికి టైం ఉంది కానీ.. ప్రధానికి మణిపూర్ వెళ్లేందుకు వీలు కాలేదా?

New Project (63)

New Project (63)

Congress: భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన ప్రధానిపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఈ విధంగా దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. మణిపూర్‌కు వెళ్లే సమయం లేదు కానీ క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు పూర్తి సమయం ఉందని మండిపడ్డారు. ఆదివారం రాత్రి మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు తాను (ప్రధాని) రాజస్థాన్‌, తెలంగాణకు వెళ్లి కాంగ్రెస్‌ను తిట్టిపోస్తానన్నారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ చూసేందుకు ప్రధాని మోడీ కూడా వచ్చారు.

అహ్మదాబాద్‌లోని తన పేరిట ఉన్న స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు ప్రధాని సమయం కేటాయించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ అన్నారు. ఇప్పుడు (రేపటి నుండి) కాంగ్రెస్‌ను తిట్టడానికి రాజస్థాన్, తెలంగాణకు వెళ్తున్నాడు. కాని మణిపూర్‌కు వెళ్ళడానికి ప్రధానికి ఇంకా సమయం దొరకలేదు. అక్కడ ఇంకా టెన్షన్ ఉంది. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టీమ్ ఇండియా బాగా ఆడుతున్నారని కొనియాడారు.

Read Also:Viral News: ఎవరు చూసిన తగ్గేదెలా.. రైల్వే స్టేషన్‌లో మహిళ డ్యాన్స్..

పోరాడడం చాలా ముఖ్యం- ప్రియాంక గాంధీ
పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపించారు. గెలుపు ఓటముల కంటే పూర్తి ఉత్సాహంతో పోరాడడమే ముఖ్యమని ప్రియాంక గాంధీ అన్నారు. మొత్తం సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. సగర్వంగా ఫైనల్స్‌కు చేరుకుంది.

Read Also:Karthika Masam First Monday: కార్తిక మాసం మొదటి సోమవారం.. గోదావరి నదికి భక్తుల తాకిడి