Viral News: టాలెంట్ ఎవరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరి లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఉన్న ప్రతిభను నలుగురిలో నిరూపించుకోవాలి అనుకోవడం కూడా తప్పు కాదు. ప్రస్తుతం సాంకేతికత పెరగడం.. సోషల్ మీడియా అందుబాటు లోకి రావడంతో మారుమూల ప్రాంతాలలో మట్టిలో మాణిక్యంలా ఉన్న ప్రతిభావంతులు ఎందరో వెలుగు లోకి వచ్చారు. అయితే అలా పేరు ప్రఖ్యాతులు పొందాలని చాల మంది ప్రయత్నిస్తున్నారు. అలా వాళ్ళు చేసే ప్రయత్నాలలో మనం ఎక్కడున్నం.. చుట్టూ ఏం జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోయి నెటిజన్స్ విమర్శలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలానే ఓ మహిళ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా డాన్స్ చేసింది.
Read also:Karthika Masam First Monday: కార్తిక మాసం మొదటి సోమవారం.. గోదావరి నదికి భక్తుల తాకిడి
వివరాల లోకి వెళ్తే.. సహేలీ రుద్ర అనే మహిళ క్రాప్ టాప్, డిస్ట్రెస్‌డ్ జీన్స్ ధరించి రైల్వే స్టేషన్ కి వచ్చింది. కాగా ఆ సమయలో రైల్వే స్టేషన్ చాల రద్దీగా ఉంది. ఆ రద్దీని కూడా లెక్కచేయకుండా డాన్స్ చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆమెను చూస్తున్న వాళ్ళ చూపులను అసలు పట్టించుకోకుండా తాను డాన్స్ చేసింది. అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రాకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ప్రసంశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు కామెంట్స్ లో విమర్శల జల్లు కురిపిస్తున్నారు.