NTV Telugu Site icon

Mallu Ravi: దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తాం

Mallu Ravi

Mallu Ravi

దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. రూ. రెండు లక్షల లోపు ఉన్న వారికే రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఎవరికైనా రుణ మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం. బీఆర్ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయం. బండి సంజయ్ మాటలు వింతగా ఉన్నాయి.
కేటీఆర్ కు పీసీసీ పదవి అని బండి సంజయ్ అనడంలో అర్థం ఉందా? కాలేశ్వరంపై విచారణ జరుగుతోంది. ఎవరికైనా చట్ట ప్రకారమే శిక్షలు పడతాయి. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల నిధుల కింద 1800 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయాలి. అయిదేళ్ళ నుంచి ఈ నిధులు పెండింగ్ లో ఉన్నాయి. బీఆర్ఎస్ పదేళ్లలో 20 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే, మా ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు.” అని ఎంపీ వ్యాఖ్యానించారు.

READ MORE: Mpox: ఎంపాక్స్ వైరస్‌పై జేపీ నడ్డా నేతృత్వంలో అత్యున్నత సమావేశం..

కొందరు రైతులకు రుణమాఫీ కాలేదనే విషయం తమకూ తెలుసని.. రుణ మాఫీ ఫిర్యాదులపై కలెక్టర్ ఆఫీసులో “ప్రత్యేక సెల్” ఏర్పాటు చేస్తున్నామని ఎంపీ మల్లు రవి తెలిపారు. “అందరికీ రుణమాఫీ చేసేందుకు బడ్జెట్ కేటాయింపు ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులలో తెలంగాణను ముంచింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేసింది. బీజేపీ జెండా కప్పుకుని చచ్చిపోతానని రేవంత్ రెడ్డి మోడీ తో అన్నారని కేటిఆర్ చెప్పడం పిచ్చికి పరాకాష్ట. కేటిఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు.” అని మాట్లాడారు.