Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress Mlc Jeevan Reddy Sensational Comments On Kaleshwaram Project

MLC Jeevan Reddy: అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరం డొల్ల ప్రాజెక్టుగా మిగులుతుంది..

Published Date :June 11, 2023 , 3:24 pm
By Mahesh Jakki
MLC Jeevan Reddy: అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరం డొల్ల ప్రాజెక్టుగా మిగులుతుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLC Jeevan Reddy: తెలంగాణ ఏర్పాటుతో తుమ్మిడిహెట్టి వద్ద ఒక ప్రాజెక్టు, మేడిగడ్డ వద్ద మరో ప్రాజెక్టు ద్వారా అన్నారం, సుందీళ్ల, ఎల్లంపల్లికి నీటి మళ్లింపు చేసేలా మహారాష్ట్రతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. ఇలా గతంలో రెండు ప్రాజెక్టుల నిర్మాణంకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జీవన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎగువన ఉన్న తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్న దిగువన ఉన్న మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రూ. 1.26 లక్షల కోట్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన పేర్కొన్నారు. 9 ఏళ్ల నుంచి మహారాష్ట్రతో ఒప్పందం అయిపోయినా తుమ్మిడిహట్టి నిర్మాణం చేపట్టకపోవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు.

Also Read: CM Kejriwal : సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రజల తరఫున జరిగిన 8 ఏళ్ల పోరాటం ఫలించింది

వార్ధా, పెన్ గంగ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన చెప్పారు. ఇక డొల్ల ప్రాజెక్టుగా మిగులుతుందని ఆయన ఆరోపించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి ప్రజానీకంను తప్పుడు తోవ పట్టిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు కదా.. 3 టీఎంసీల పేరుతో పెద్దపల్లి రైతులను మోసం చేస్తున్న విషయం నిజం కాదా ఈశ్వర్ అంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. 1.5 టీఎంసీతో ఏర్పాటు చేస్తున్న రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీ భూములకు ప్రత్యమ్నాయ భూములు ఇవ్వకపోవడంతో కనీసం తూము కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఆర్బాటంగా ఏర్పాటు చేసిన దళిత బంధు 22-23 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలోని 1500 మంది నిరుద్యోగులకు 10 లక్షల రూపాయల చొప్పున 17,700 కోట్లు కేటాయించినా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బీసీల్లో కొందరికి రూ.లక్ష ఇస్తామని ప్రకటిస్తున్నారని, గడిచిన నాలుగేళ్లకు కలిపి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: AICC Sampath Kumar : కేసీఆర్ మీరు అలంపూర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

ఏ విషయం పైన అయినా ఎక్కడ చర్చ పెడతావో చెప్పు కొప్పుల ఈశ్వర్.. అక్కడ చర్చిద్దాం.. దేని మీద చర్చ పెడదామో చెప్పు అంటూ జీవన్‌ రెడ్డి సవాల్ విసిరారు. కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారానే ఇప్పటికీ మూడు జిల్లాల్లో 7 లక్షల సాగు అవుతుందన్నారు. చక్కర ఫ్యాక్టరీనీ 100 శాతం ప్రభుత్వం పరంగా నడిపిస్తామని ఉద్యమ మాటగా చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ప్రాజెక్ట్ నివాసిత ప్రాంతాల వద్ద ఏర్పాటు చేయొద్దు అది కొప్పులకు తెలియదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. క్రిబ్ కో ప్రభుత్వ రంగ సంస్థ అయితే చక్కర ఫ్యాక్టరీ పునర్నిర్మాణం చేయించాలని డిమాండ్ చేశారు. కేవలం లాభాలు కోసమే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress MLC Jeevan Reddy
  • Kaleshwaram project
  • Koppula Eshwar
  • telangana
  • telugu news

తాజావార్తలు

  • Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!

  • Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

  • Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ

  • తప్పు చేస్తే అగ్రరాజ్యమైనా సరే.. అమెరికాకు భారత HAL మాస్ వార్నింగ్!

  • Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్‌కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions