Site icon NTV Telugu

Jeevan Reddy: ఎమ్మెల్సీ కవిత కామెంట్స్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌంటర్..

Jeevan Reddy

Jeevan Reddy

ఎమ్మెల్సీ కవిత కామెంట్స్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టే చేస్తారనుకోవడం విచారకరమని తెలిపారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4 గా ఉన్న సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయాలని రిపోర్ట్ లో ఉందని అన్నారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే నేర నిర్ధారణ జరిగినా కూడా నిందితుడైన సర్పంచును పరారీలో చూపెట్టారని ఆరోపించారు.

Republic Day: ఢిల్లీలో ఆకట్టుకున్న తెలుగు రాష్ట్రాల శకటాలు..

రెండున్నర మాసాలు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు ఎన్నిక ప్రక్రియలో బిజీగా ఉన్నాడని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఊరు పెద్ద మనిషైన సర్పంచ్ ఊరిలో ఉన్నా పోలీసులకు తెలియకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల్లో వెసులు బాటు కల్పించడానికి ఈ కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా పోలీసులపైనే చర్యలు తీసుకోవాలి.. ఎవరు ఎవరికీ ఫ్రెండ్లి పోలీసో కవిత సమాధానం చెప్పాలని తెలిపారు. చట్టం, పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోయి శివనాగేశ్వర్ ప్రాణం అర్పించుకున్నాడన్నారు. కొడుకును కోల్పోయిన తల్లి హృదయం ఏ విధంగా ద్రవించిందో ఒక తల్లిగా కవితకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఆ బాధిత మృతుని తల్లిని పరామర్శిస్తే సంతోషించే వాడినని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Vishal: నేను ఇష్టపడిన వారంతా దూరం అవుతున్నారు… హీరో ఎమోషనల్

రాజకీయ కారణాలతో నెపాలు నెట్టుకుంటా పబ్బం గడపడం ఎంత వరకు సమంజసం అని జీవన్ రెడ్డి ఫైరయ్యారు. ఎంతవరకు రాజకీయ కోణం తప్ప మానవత్వం లేదా..?అని ప్రశ్నించారు. అమ్మగారు(కవిత) సాధారణ రాజకీయ నాయకురాలు కాదు.. జాగృతి సామాజిక స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలుగా విచారణ చేయించు నీ స్వచ్చంద సంస్థలతో అని కోరారు. బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు ఫ్రెండ్లీ కాబట్టి సర్పంచును అబ్ స్క్యాండింగ్ గా చూపించారని దుయ్యబట్టారు. ఆరోపణలు చేసే ముందు పూర్వపరాలు చూసుకోవాలి.. ఎస్పీ ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

Exit mobile version