Site icon NTV Telugu

V.Hanumantha Rao : కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని బీజేపీ విమర్శలు సరికాదు

V Hanumantha Rao

V Hanumantha Rao

Congress Leader V Hanumantha Rao Counter to BJP Leaders

బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీ. హనుమంత్‌ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని బీజేపీ విమర్శలు సరికాదన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని ఆయన గుర్తు చేశారు. సోనియా గాంధీకి ప్రధాన మంత్రి పదవి వచ్చిన తీసుకోలేదని, ఏఐసీసీ ఎన్నికల్లో మల్లికార్జున్‌ ఖర్గ, శశిథరూర్ పోటీలో ఉన్నారని, మల్లికార్జున్ ఖర్గేకి గ్రౌండ్ రియాల్టీ తెలుసు.. శశిథరూర్ ఏమీ తెలియదన్నారు.

 

మల్లికార్జున్ ఖర్గే డిబేట్స్‌కు రావాలని శశిథరూర్ అనడం సరికాదని, శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతి అని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటీష్ సంస్కృతి ఇక్కడకి తీసుకురావాలని శశిథరూర్ చూస్తున్నాడా అని ఆయన ప్రశ్నించారు. శశిథరూర్ మాకు చెప్పి నామినేషన్ వేయలేదని, రాహుల్ తెలంగాణలో పాదయాత్రతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు.

Exit mobile version