Site icon NTV Telugu

Thummala Nageswara Rao: పువ్వాడపై తుమ్మల నాగేశ్వరరావు ఘాటు విమర్శలు

Thummala Nageshwararao

Thummala Nageshwararao

Thummala Nageswara Rao: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార హోరును పెంచింది. ఖమ్మం నగరం మామిల్లగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పువ్వాడపై తుమ్మల ఘాటు విమర్శలు చేశారు. మీ ఆవేశాన్ని కసిని ఎట్లా ఆపాలో అర్థం కాక ఆయన తత్తర పడుతున్నాడన్నారు. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారు మూడో తారీఖు తరువాత కనపడరన్నారు. మనకు బదులు తీర్చుకునే తత్వం లేదు కానీ ఈసారి తప్పనట్టు ఉంది వీళ్ళ కథలు చూస్తుంటే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Also Read: Mallikarjuna Kharge: కాంగ్రెస్ పార్టీతోనే పేదల బ్రతుకులు మారుతాయి..

పేపర్‌లు లీకులు చేసి పేపర్‌లు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. కట్టిన ప్రాజెక్టులు మూడు రోజులకే కూలిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూమి ఎక్కడ కనపడితే అక్కడ బీఆర్‌ఎస్‌ నాయకులు దస్తీ వేస్తున్నారన్నారు. ఖమ్మం మరో బీహార్ మాదిరిగా తయారైందన్నారు. వచ్చిన నిధులను దోచుకోవడం కోసం బస్‌స్టాండ్‌ను రేకుల షెడ్డు చేశారన్నారు.

Exit mobile version