Site icon NTV Telugu

Sunkara Padmasree: మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు!

Sunkara Padmasree

Sunkara Padmasree

రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరలా మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?.. రాజధాని మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని అరెస్టు చేయరా? అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.

‘రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా?. మళ్లీ మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారు. ఓ చానల్‌లో‌ కృష్ణంరాజు వాగితే.. కొమ్మినేని వెటకారాలు ఆడారు. వాటిని సోషల్ మీడియాలో కట్ చేయకుండా వీడియోలు పెట్టారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు. నిన్న మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నా.. కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?. రాజధాని మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని అరెస్టు చేయరా?’ అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.

Also Read: Nithin : ‘తమ్ముడు’ మూవీ నుంచి ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ లుక్ ..

‘రాష్ట్ర హోంమంత్రి, మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ ఎందుకు‌ మాట్లాడటం లేదు?. మహిళల క్యారెక్టర్ కించపరిచిన వారినే అరెస్టు చేయలేకపోతే.. ఇక రాష్ట్రంలో మహిళలకు మీరేం న్యాయం చేయగలరు. కొమ్మినేని, కృష్ణంరాజులు ఇద్దరినీ అరెస్టు చేయాలి. ప్రభుత్వం చేతకాని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు స్పందించాలి. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి’ అని సుంకర పద్మశ్రీ కోరారు. ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు.

Exit mobile version