Sonia Gandhi: వీడియో: శ్రీనగర్ లో సోనియా గాంధీ బోట్ రైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బోట్ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శనివారం ఉదయం సోనియా గాంధీ జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ నగరానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఆమెను ఘనంగా ఆహ్వానించాయి. ఆమెకు పుష్పగుచ్ఛాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీశ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించారు సోనియా. ఇక తరువాత సోనియా నగీన్ సరస్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆమె ఓ ఇంజన్ బోటు పై రైడ్ కు వెళ్లారు. ఆమెతో పాటు ఆమె భద్రత సిబ్బంది కూడా బోటులో ప్రయాణించారు. అంతేకాకుండా బోటులో ప్రయాణిస్తున్నప్పుడు సోనియా సరస్సు అందాలను ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు సరస్సు గురించి సోనియా తన సిబ్బందిని ఏదో అడిగి తెలుసుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది.
సోనియా గాంధీ తనయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే లఢక్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్గిల్ లో భారత జవాన్లతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాకుండా చైనా ఇండియా బోర్డును కూడా ఆయన పరిశీలించారు. ఇండియా భూభాగాలు ఆక్రమణకు గురైనట్లు తాను గుర్తించినట్లుగా కూడా రాహుల్ పేర్కొన్నారు. ఇక ఆ పర్యటన సందర్భంగా రాహుల్ బైక్ రైడ్ కూడా చేశారు. రాహుల్ గాంధీ నగీన్ బోర్టు హౌస్ లో ఉంటున్నారు. ఈ కారణంగానే సోనియా నగీన్ సరసు వద్దకు వెళ్లి బోటులో ప్రయాణించి రాహుల్ ను కలుస్తారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా వీరితో కలుస్తారు.ఈ హోటల్‌తో చాలాకాలంగా రాహుల్ కుంటుంబానికి అనుబంధం ఉందని చెబుతున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని, కుటుంబ సభ్యులంతా కలుసుకోవడానికే పరిమితమనదిగా తెలుస్తోంది. దీనిలో ఎటువంటి రాజకీయ సమావేశాలు జరగవని తెలుస్తుంది. రైనవారి ప్రాంతంలోని హోట్‌ల్‌లో వీరంతా బస చేసే అవకాశం ఉంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఈ మధ్యే పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
#WATCH | J&K: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives in Srinagar and takes a boat ride in Nigeen Lake
She will be meeting Congress MP Rahul Gandhi shortly pic.twitter.com/9jBEKG2ZB8
— ANI (@ANI) August 26, 2023
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!