Site icon NTV Telugu

Maharashtra: బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ కోడలు..

Maharastra

Maharastra

లోక్‌సభ మాజీ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్ చకుర్కర్ ఇవాళ (శనివారం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. డాక్టర్ అర్చన పాటిల్ చకుర్కర్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను దక్షిణ ముంబైలోని ఆయన అధికారిక నివాసం ‘సాగర్’లో కలిశారు. ఆమె ఉద్గీర్‌లోని ‘లైఫ్‌కేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్’ చైర్‌పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, ఆమె భర్త శైలేష్ పాటిల్ చకుర్కర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శివరాజ్ పాటిల్ 2004 నుంచి 2008 మధ్య యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.

Read Also: Congress: జమ్మూ కాశ్మీర్‌లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్లు.. తెలంగాణ సీఎంకి చోటు

ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దీని కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు పూర్తి చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ నిర్దేశించిన 370 సీట్ల లక్ష్యాన్ని సాధించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీజేపీకి కీలకమైంది. యూపీ నుంచి 80 మంది ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి సమక్షంలో జరిగే ఈ మెగా ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అలాగే, ప్రముఖ టీవీ సీరియల్ రామాయణంలో శ్రీరాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్‌ను భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిగా చేయనున్నారు.

Exit mobile version