NTV Telugu Site icon

Shashi Tharoor: ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం ఎవరంటే..?

Shasi Taroor

Shasi Taroor

పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే ప్రశ్నను ఓ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కు కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందుకంటే మేము ఒక వ్యక్తిని ఎన్నుకోము, పార్టీ లేదా కూటమిని ఎన్నుకుంటాము అని ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే, భారతదేశ సమ్మిళిత వృద్ధిని సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రిగా తమ కాంగ్రెస్, కూటమి ఎవరిని ఎన్నుకుంటారు అనేది సెకండరీ పాయింట్.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ప్రథమ కర్తవ్యం అని శశి థరూర్ పేర్కొన్నారు.

Read Also: Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి..?!

మా దగ్గర మోడీకి ప్రత్యామ్నాయం అనుభవజ్ఞులైన, సమర్థులైన ఇండియా కూటమిలో నాయకుల సమూహం ఉంది అని ఎంపీ శశి థరూర్ చెప్పుకొచ్చారు. వారు ప్రతి రోజు ప్రజల సమస్యలకు ప్రతిస్పందిస్తారు.. తప్పా వ్యక్తిగత అహంతో ఉందరు అని తెలిపారు. వారు ఏ నిర్దిష్ట వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు అనేది పెద్ద విషయం కాదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, కేరళలోని తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన థరూర్ ఇప్పుడు అదే స్థానం నుంచి నాలుగో సారి లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై ఆయన పోటీ చేశారు. ఇక, లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి పన్యన్ రవీంద్రన్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, గత రెండు వారాలుగా శశి థరూర్ రాబోయే ఎన్నికల కోసం తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. తిరువనంతపురంలో ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.