Pallam Raju: మోడీ సర్కార్‌పై వ్యతిరేకత.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallam Raju: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. అయితే, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు మార్గం సుగమం చేస్తోంది.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, ఏపీ సీనియర్ నేత పల్లంరాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కర్నాటక కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేసి ఈ విజయం సాధించారని తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Read Also: CM KCR : తెలంగాణ దశాబ్ది వేడుకలపై సీఎం కేసీఆర్ సమీక్ష
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకాన్న వ్యక్తం చేశారు పల్లం రాజు.. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఇకపై కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమనే భావన మొదలైందన్న ఆయన.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.. ఏపీలో కూడా సానుకూల ప్రభావం ఉంటుందన్న ఆయన.. విభజన అంశం ఇప్పుడిప్పుడే పాతపడిపోతోంది. ఏపీలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు పూర్తిగా అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయ్యింది.. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకుంటే, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుంటుంది. అందుకోసం కష్టపడుతున్నాం అని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజల్లో మంచి మనసున్న నాయకుడు అనే అభిప్రాయం బలపడింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!