Site icon NTV Telugu

Congress: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. కీలక పదవికి ఆరిఫ్ ఖాన్ రాజీనామా

Rehe

Rehe

సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి మహ్మద్ ఆరిఫ్ (నసీం) ఖాన్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్టార్ క్యాంపెయినర్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. తదుపరి దశల్లో జరగబోయే స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. మహారాష్ట్రలో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టకపోవడం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అన్యాయమైన నిర్ణయంతో తాను కలత చెందినట్లుగా లేఖలో ఆరిఫ్ (నసీం) ఖాన్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలో భాగంగా ఆయా పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం వర్గానికి సీటు లభించలేదు. దీంతో ఆయన అలకబూనారు.

ఇది కూడా చదవండి: Nama Nageswara Rao: కాంగ్రెస్ మాయ మాటలకు ప్రజలు మోసపోయారు

పదవి నుంచి వైదొలగడానికి గల కారణాలను లేఖలో పంచుకున్నారు. నాల్గవ దశ సార్వత్రిక ఎన్నికలకు తన పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మూడు, నాలుగు, ఐదవ దశల్లో మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయబోమని ఆయన తెలియజేశారు. మహారాష్ట్రలో MVA (మహా వికాస్ అఘాడి) మరియు కాంగ్రెస్ ఒక్క ముస్లిం అభ్యర్థిని నామినేట్ చేయకూడదని తీసుకున్న నిర్ణయం తనను కలతకు.. నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. కనీసం ఒక్క ముస్లిం అభ్యర్థి అయినా నామినేట్ అవుతారని ఆశించిన అనేక ముస్లిం సంస్థలు, నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Karimnagar: కరీంనగర్ లో 20 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

ఇదిలా ఉంటే గతంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను ఖాన్ శ్రద్ధగా నిర్వర్తించారు. ప్రస్తుతం ముస్లిం సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లుగా సమాచారం.

మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికి రెండు దశల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Ragisn

 

Exit mobile version