Site icon NTV Telugu

Maheshwar Reddy : ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. ఫేక్ మినిస్టర్ అని తేలిపోయింది

Maheshwar Reddy

Maheshwar Reddy

కాంగ్రెస్ విడుదల చేసిన చార్జిషీట్‌పై మంత్రి హరీష్ రావు కామెంట్స్ శోచనీయమన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు..బూటకపు మాటలు మాట్లాడారు హరీష్ అని ఆయన మండిపడ్డారు. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా.. అనవసర విషయాలు మాట్లాడారని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ‘9 ఎండ్లలో ఎన్ని ఆసుపత్రులు కట్టారు.. ఎంత మంది వైద్యులను నియమించారు. ఇవేం చేయకుండా.. ఆసుపత్రుల్లో బెడ్స్ పెరిగాయా..? కాన్పులు ఎలా పెరిగాయి. వైద్యులు కాకుండా… ఎవరు కాన్పులు చేస్తున్నట్లు.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది అక్కడి ప్రజలు అడుగుతారు. ఇక్కడ ప్రజలు మీకు ఓటేశారు.. ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పు. ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం కానీ….ఇప్పుడు ఫేక్ మినిస్టర్ అని తేలిపోయింది. ఎక్కడ చర్చకు వస్తారో.. Phcలో చర్చకు వస్తావా..? జిల్లా ఆసుపత్రిలో చర్చకు వస్తావా..? 1200 కోట్లతో సెక్రటేరియట్ కడతారు.. పార్టీ ఆఫీసులు కడతారు కానీ పేదల కోసం ఆసుపత్రి ఒక్కటి కూడా కట్టలేదు. అది బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ది. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే..మహిళలు చనిపోయింది గుర్తు లేదా..! అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడం కాదు. మహిళలు ఆసుపత్రికి రావాలంటే జంకుతున్నారు. నిర్మల్ లో పనికి మాలిన మంత్రి ఉన్నాడు. ఏరియా ఆసుపత్రిలో 22 మంది వైద్యుల పోస్టులు ఖాళీ. కాన్పులు వార్డులో సగం మంది వైద్యులే. సగం మంది వైద్యులతో ఎలాంటి వైద్యం చేస్తారు.

Also Read : China: అక్కడ పెళ్లి చేసుకోకుండానే బిడ్డను కనొచ్చు..కారణం ఏంటంటే?

వైద్యరంగంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం వైద్య ఆరోగ్య శాఖ పై చర్చకు సిద్ధమా..? తెలియక మాట్లాడినట్టు నిరూపిస్తే.. రాజకీయాల నుండి తప్పుకుంటా. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేసిన ఆసుపత్రులకు 800 కోట్లు బాకీ పడ్డది నిజం కాదా. వైద్యం మానేస్తం అని ఆసుపత్రులు చెప్పింది నిజం కాదా..? చర్చకు సిద్దమేనా హరీష్. 76 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల కు వైద్యం కోసం వెళ్తున్నారు అంటే ప్రభుత్వ వైద్యం ఎట్లా ఉందో అర్దం చేసుకోవచ్చు. 24 శాతం మంది కూడా మెడిసిన్ కోసం 80 శాతం మంది ప్రైవేట్ మెడికల్ షాపు లకు వెళ్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడడు హరీష్. వైద్యుల సంఖ్యని పెంచకముందే… కాన్పులు ఎవరు చేశారు. కాన్పులు వైద్యులు చేశారా.. మంత్రసానులు చేశారా..? 1100 మంది వైద్యుల పోస్టులు ఖాళీ లేవా కేసీఆర్‌..ఆరోగ్య శాఖ మంత్రిని మార్చి సమర్థవంతమైన వ్యక్తిని మంత్రి చేయండి.

Also Read : Mickey Arthur: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆ జట్టుకు ఆన్‌లైన్ కోచ్‌!

ఆసుపత్రుల నిర్మాణం పై కేసీఆర్‌ హామీ.. కేసీఆర్ కి రాజ్యాంగం మీద గౌరవం లేదు. గవర్నర్ మీద కేసు వేయడం ఎందుకు… విత్ డ్రా చేసుకోవడం ఎందుకు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదానికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ని అందరూ గౌరవించాలి. గవర్నర్ పై అనుమానాలు ఉంటే .. రాష్ట్రపతి ని కలవాలి, పార్లమెంట్ లో మాట్లాడండి గతంలో గవర్నర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్పుడు తెలియదా. ఆ గవర్నర్ ఉంటే… వ్యవస్థ బాగున్నట్టు .. మీకు గవర్నర్ నచ్చకపోయే వ్యవస్థ బాగోలేనట్టా..?’ అని మహేశ్వర్‌ రెడ్డి వీడియో రిలీజ్‌ చేశారు.

Exit mobile version